YSR Family బలం, బలహీనత తెలుసు.. వారిపై గెలవడం ఈజీ

వైఎస్సార్ కుటుంబంపై ఇప్పటికే ఓసారి గెలిచానని, ఇప్పుడు వారిపై గెలవడం తనకు చాలా ఈజీ (సులభం) అని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (మారెడ్డి రవీంద్రనాథ్‌‌రెడ్డి) వ్యాఖ్యానించారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి సతీశ్‌రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని బీటెక్‌ రవి తెలిపారు. టీడీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తే పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.